Jio Fiber Welcome Offer in Telugu Registration/Sign up: జియో ఫైబర్ సేవలను జియో మూడో వార్షికోత్సవ రోజైన సెప్టెంబరు 5 నుంచి మొదలు పెట్టనున్నారు. కనీసం 100 MBPS వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలు నెలకు రూ. 700 (జీఎస్టీ అదనం) నుంచి పొందవచ్చు. 1 GBPS వేగం సేవలు పొందేందుకు నెలవారీ రూ. 10,000 (జీఎస్టీ అదనం) వరకు అద్దె పథకాలున్నాయి.
Jio Fiber Welcome Offer in Telugu Registration/Sign up రూ.700కే జియో ఫైబర్
రిలయెన్స్ జియో గిగాఫైబర్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. గిగాఫైబర్ సేవల్ని పొందే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది రిలయెన్స్ జియో. గిగాఫైబర్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ ముకేష్ అంబానీ ప్రకటించారు. ‘జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్’ పేరుతో ఈ ఆఫర్ ప్రకటించారు. ఈ యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే కేవలం ప్లాన్ ఛార్జీలు చెల్లిస్తే చాలు. హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా పొందొచ్చు. గిగాఫైబర్ ప్లాన్స్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి 1 జీబీపీఎస్ వరకు ఉంటాయి. రూ.700 నుంచి రూ.10,000 వరకు ప్లాన్స్ ధరలు ఉంటాయి. జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు.
రూ.700కే జియో ఫైబర్
జియో టెలికం సర్వీసులు ప్రారంభించి మూడేళ్లవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 5న జియో ఫైబర్ సర్వీసులను కూడా ప్రారంభించనున్నట్లు అంబానీ వెల్లడించారు. ల్యాండ్ లైన్ నుంచి జీవితకాలం పాటు ఉచిత వాయిస్ కాల్స్… కనిష్టంగా 100 ఎంబీపీఎస్ బ్రాండ్ బ్యాండ్ స్పీడ్ అందించేట్లుగా ఈ సర్వీసులుం టాయి. నెలకు రూ. 100 నుంచి రూ. 10,000 దాకా ప్లాన్స్ ఉంటాయి. అమెరికా, కెనడాలకు నెలకు రూ.500 అద్దెకే ల్యాండ్ లైన్స్ నుంచి అపరిమిత ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ రేట్లతో పోలిస్తే ఇది అయిదో వంతు నుంచి పదో వంతు దాకా తక్కువ ఉంటుందని అంబానీ తెలిపారు.
వేగంలో సాటి లేదు
‘అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాల్లో కూడా ఫిక్సిడ్ లైన్ డౌన్లోడ్ స్పీడ్ 90 ఎంబీపీఎస్ మాత్రమే ఉంటోంది. కానీ మన దగ్గర జియో ఫైబర్ ప్రారంభ ప్లానే 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుం ది. 1 జీబీపీఎస్ దాకా స్పీడ్ పొందవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో సగటు Fixed లైన్ డౌన్లోడ్ వేగం 90 MBPS ఉంది. భారత్లో జియో ఫైబర్ పథకాల్లో ప్రారంభ పథకంలోనే 100 MBPS వేగాన్ని అందిస్తున్నాం. అంతర్జాతీయ రేట్లతో పోలిస్తే పదో వంతు ధరలకే వీటిని ప్రకటిస్తున్నాం. ఈ పథకాలకు అనుబంధంగా ప్రీమియమ్ ఓవర్ ద టాప్(ఓటీటీ) అప్లికేషన్లనూ సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. తొలి ఏడాదిలోనే దాదాపు 1600 పట్టణాలలో 2 కోట్ల గృహాలు, 1.5 కోట్ల వ్యాపార సంస్థలకు మేం సేవలందించాలని నిర్ణయించాం.
ఇంటా.. బయట
జియో పోస్ట్ పెయిడ్ ప్లస్తో ప్రయారిటీ సిమ్-సెటప్ సేవలను అందిస్తారు. ఇంటా.. బయటా అన్ని డివైజ్లకు డేటా, వాయిస్ అనుసంధాన సేవలు ఉంటాయి. వీటిలో కుటుంబపథకాలు, అంతర్జాతీయరోమింగ్ పథకాలుంటాయి.
ఉచిత వాయిస్ కాల్స్
చందాదార్లందరికీ ల్యాండ్ లైన్ ఫోన్ ఉచితంగా ఇస్తాం. భారత్లోని ఏ మొబైల్/ల్యాండ్లైన్ కైనా జీవితకాలం పాటు ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అత్యంత తక్కువ ధరకు అంతర్జాతీయ అపరిమతి కాలింగ్ ప్యాక్ ను కూడా జియో అందిస్తోంది. ల్యాండ్ లైన్ నుంచి అమెరికా, కెనడాలకు రూ. 500 నెలవారీ సబ్స్క్రిప్పన్తో పొందొచ్చు. ప్రస్తుత మార్కెట్ టారిఫ్ లను చూస్తే ఇవి 5-10వ మంతు మాత్రమే.
జియో గిగాఫైబర్‌తో 4K టీవీ, 4K సెట్ టాప్ బాక్స్ ఉచితం
జియో ఫరెవర్ ప్లాన్ పేరిట ఉండే వార్షిక ప్లాన్ ఎంచుకున్న వారికి HD లేదా 4కే ఎల్ఈడీ TV సెట్ కూడా ఉచితంగా అందించనున్నట్లు ముకేష్ అంబానీ చెప్పారు. దీంతో పాటు 4కే సెట్ టాప్ బాక్స్ ను కూడా ఉచితంగా పొందవచ్చు. అలాగే ప్రముఖ ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్స్కి కూడా సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
జియో ఫైబర్, జియో సెట్ టాప్ బాక్స్ల సేవల్లో అత్యుత్తమ నాణ్యత, అను భవం కావాలంటే అది.. ఎల్ ఈడీ టీవీ ఉంటేనే సాధ్యం. అందుకే వార్షిక పథకాలను(జియో ఫరెవర్ ప్లాన్స్) ఎంచుకునే వినియోగదార్లకు హెచ్డీ లేదా 4K ఎల్ఈడీ టీవీ, 4K సెట్ టాప్ బాక్స్లను ఉచితంగా ఇస్తాం.
జియో ఫైబర్ సేవల కింద జియో 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితంగా అందజేస్తారు. వైఫై రూటరు, సెట్ టాప్ బాక్స్ కలిపే ఉంటాయి. వీటితో సాధారణ టీవీనీ స్మార్ట్ టీవీగా మార్చుకోవచ్చు. లైవ్ టీవీ ఛానళ్లు, ఉచితంగా అంతర్జాతీయ వీడియో కాన్ఫరెన్స్, కన్సోల్ క్వాలిటీ గేమింగ్, వీఆర్ (వర్చు వల్ రియాలిటీ), ఏఆర్ (ఆగ్ మెంటెడ్ రియాలిటీ) సొల్యూషన్లు పొందొచ్చు. హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమె జాన్ ప్రైమ్, సోటీలైవ్, ఎరోస్నౌ, హోయ్చోయ్, ఆల్ట్ బాలాజీ వంటి ఓటీటీ కంటెంట్ ప్రొవైడర్లకు సంబం ధించిన ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్లూ జియో ఫైబర్లో అందుబాటులో ఉంటాయి. (కేబుల్ ఫైబర్/ డీటీహెచ్ ద్వారా ప్రసారమయ్యే టీవీ ఛానళ్లకు మాత్రం చందాదార్లు అదనంగా చెల్లించాల్సిందేనని కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు.)
ఫస్ట్ డే ఫస్ట్ షో..
సినిమాలు థియేటర్లలో రిలీజైన రోజే ఇంట్లోనే వాటిని చూసే సర్వీసు కూడా ప్రవేశపెడు తున్నట్లు అంబానీ చెప్పారు. జియో ఫస్ట్ డే ఫస్ట్ షో పేరిట 2020 మధ్యలో దీన్ని అందు బాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రీమియం కస్టమర్లు ఈ సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు.
భారత్ లోనే తొలిసారిగా కొత్త సినిమాలను విడుదల రోజే, నేరుగా ఇంట్లో చూసే ఆలోచనతో ముందుకొచ్చాం. ప్రీమియం జియో ఫైబర్ వినియోగదార్లు తమ ఇంట్లోనే తిలకించవచ్చు.
Microsoft తో జట్టు
కొత్తగా క్లౌడ్ డేటా సెంటర్స్ ఏర్పాటు కోసం సాఫ్ట్ వేర్ దిగ్గజం Microsoft చేతులు కలిపినట్లు అంబానీ చెప్పారు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ ప్లాట్ ఫాం ఆధారంగా ఈ ప్రపంచ స్థాయి డేటా సెంటర్స్ ఏర్పాటవుతాయని ఆయన తెలిపారు. ఇందుకోసం ఇరు సంస్థలు దీర్ఘ కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Leave a Reply